Hyderabad, ఏప్రిల్ 7 -- విజేత కావాలన్నది ప్రతి ఒక్కరి కోరిక. కొంతమందికి వ్యాపారంలో లాభాలు సాధిస్తే విజేతగా భావిస్తారు. మరికొందరు పరీక్షల్లో మార్కులు ఎక్కువ వస్తే విజేతగా భావిస్తారు. అనుకున్న లక్ష్యాన్ని చేరడమే ప్రతి వ్యక్తి ఆలోచనలో విజేత అనే పదానికి అర్థం.

అయితే కొన్ని రకాల స్వభావం, అలవాట్లు కారణంగా కొంతమంది విజయం సాధించలేరు. అయితే మీరు విజయం సాధించాలంటే కొన్ని ప్రాథమిక సూత్రాలు పాటించాలి. కొన్ని విషయాలను కచ్చితంగా కలిగి ఉండాలి. ముఖ్యంగా ఐదు విషయాలు మీ జీవితంలో విజయాన్ని ప్రభావితం చేస్తాయి.

చెడు అలవాట్ల వల్ల ఒక వ్యక్తి విజయం సాధించలేడు. దీనివల్ల ఎన్నోసార్లు వారు బాధకు లోనవుతారు. సున్నితంగా ఉన్నవారు కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. నిజానికి ఓటమి కూడా గెలుపుకు చుట్టమే.

మీరు ఓడిపోయారంటే దాదాపు గెలుపు అంచులకు వచ్చి పడిపోయారని అర్థం. అంట...