Hyderabad, ఏప్రిల్ 6 -- పిల్లలను మానసికంగా ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో నిండి ఉండేలా పెంచడం చాలా బాధ్యతాయుతమైన పని. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఇది సలవాళుతో కూడినదే చెప్పాటి. ఆడపిల్లలు సమస్యలను ఎదుర్కోవడం, వాటి నుంచి కోలుకోవడం అనేది వారి మానసిక సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటుంది.

ఆడపిల్లలు మానసికంగా బలంగా ఉండాలంటే చిన్నతనం నుంచే వారికి చక్కటి పెంపకం, మద్దతు, స్నేహపూర్వకమైన వాతావరణం ఉండాలి. ఇందులో తల్లులకు ప్రధాన పాత్ర ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎలాగో తెలుసుకుందాం రండి.

ప్రముఖ మనోవిజ్ఞాన నిపుణురాలు జ్యోతి కపూర్ ఇండియా టైమ్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెబుతున్న విషయం ఏంటంటే.. మీ కుమార్తెను ఆత్మవిశ్వాసంతో, ధైర్యంతో పెంచాలనుకుంటే, సమస్యలను ఎదురుకునే సామర్థ్యాన్ని వారిలో పెంచాలనుకుంటే ముందుగా మీరు ఈ లక్షణాలను కలిగి ఉండాలి. ముందుగా ఈ మనస్తత్వాన్ని మీరు ప...