భారతదేశం, డిసెంబర్ 1 -- మోక్షద ఏకాదశి 2025: ఈరోజే మోక్షద ఏకాదశి. ఈరోజు విష్ణువుని ఆరాధిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఉపవాసం ఉంటే కూడా ఎన్నో ఎక్కువ రెట్లు ఫలితాన్ని పొందవచ్చు. మహావిష్ణువుని ఈరోజు భక్తి శుద్ధతో ఆరాధిస్తే పాపాలన్నీ తొలగిపోతాయి. గత జన్మలో కర్మ బంధాల నుంచి విముక్తి కలుగుతుంది. మోక్షదా ఏకాదశి నాడు "ఓం నమో భగవతే వాసుదేవాయ" మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని జపిస్తే భయాలన్నీ కూడా తొలగిపోతాయి.

జీవితంలో సానుకూల శక్తి కలిగి బాగుంటుంది. వృత్తిపరంగా కూడా కలిసి వస్తుంది. విజయాన్ని అందుకోవచ్చు. అడ్డంకులన్నీ తొలగిపోతాయి. అలాగే మంత్రాన్ని జపిస్తే ఆధ్యాత్మిక బలం కలుగుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటుంది. శత్రువుల కష్టాల నుంచి కూడా బయటపడవచ్చు. క్రమం తప్పకుండా ఈ మంత్రాన్ని జపిస్తే వ్యక్తిగత వృద్ధి కూడా ఉంటుంది. పైగా ఈరోజు గీతా జయంతి కూడా కాబట్టి వి...