భారతదేశం, నవంబర్ 26 -- Mokshada Ekadashi 2025: ప్రతీ ఏటా మార్గశిర్ష మాసంలో మోక్షద ఏకాదశి వస్తుంది. ఆ రోజు శ్రీ హరిని ఆరాధించడం, ఉపవాసం ఉండడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చు. మార్గశిర మాసంలో శుక్ల పక్షం ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. పేరు సూచించినట్లుగానే, ఈ ఏకాదశి ఉపవాసం మోక్షాన్ని ఇస్తుంది. ఈ ఏడాది డిసెంబరు 1న మోక్షద ఏకాదశి వచ్చింది.

ఈ సంవత్సరం ఏకాదశి సోమవారం వస్తుంది, కాబట్టి శివుడు, విష్ణుమూర్తి ఇద్దరి ఆరాధన చాలా ఫలించబోతోంది. గీతా జయంతిగా జరుపుకునే శ్రీమద్ భగవద్గీతను బోధించే పవిత్ర రోజు కూడా అదే రోజు కావడం విశేషం. మోక్షద ఏకాదశి నాడు ఉపవాసం ఉండటం వల్ల పాపాలు తొలగిపోవడమే కాకుండా, జీవితంలో శాంతి, శ్రేయస్సు, మోక్షాన్ని కూడా పొందవచ్చని నమ్ముతారు.

హిందూ సంప్రదాయం ప్రకారం, మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పాపాలు తొలగిపోతాయి, మోక్షం ...