Hyderabad, మార్చి 23 -- Mohanlal About Akkineni Nageswara Rao Dil Raju Tollywood: మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాలు ఖురేషి-అబ్రామ్ అలియాస్ స్టీఫెన్ నెడుంపల్లిగా మళ్లీ అలరించనున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ఎల్2 ఎంపురాన్. 2019లో బ్లాక్ బస్టర్ హిట్ మూవీ లూసిఫర్‌కు ఇది సీక్వెల్.

ట్రయాలజీలో భాగంగా రెండో సినిమాగా తెరకెక్కిన ఎల్2 ఎంపురాన్ మూవీకి సలార్ విలన్, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మోహన్ లాల్-పృథ్వీరాజ్ సుకుమారన్ కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా కావడంతో ఎల్2 ఎంపురాన్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దానికి తగినవిధంగానే మార్చి 27న మలయాళంతోపాటు తెలుగు, తమిళ, హిందీ, కన్నడ భాషల్లో ఎల్2 ఎంపురాన్ గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.

ఈ నేపథ్యంలో తాజాగా శనివారం (మార్చి 22) నాడు హైదరాబాద్‌లో ఎల్2 ఎంపురాన్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గ...