Hyderabad, మార్చి 12 -- Mohan Lal Thriller Movies on OTT: మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ ఇండియన్ సినిమాకి, ముఖ్యంగా మలయాళం సినిమాకి చేసిన సేవలు అన్నీఇన్నీ కావు. ఎన్నో లెక్కలేనన్ని గొప్ప సినిమాలు చేశాడు. అవి ఎప్పటికీ అభిమానుల గుండెల్లో నిలిచిపోతాయి. అతడు త్వరలోనే ఎల్2:ఎంపురాన్ సినిమాలో కనిపించబోతున్నాడు. అయితే ఇప్పటికే ఓటీటీలో అందుబాటులో ఉన్న మోహన్ లాల్ థ్రిల్లర్ మూవీస్ ఏవో ఒకసారి చూడండి.

దృశ్యం 2013లో వచ్చిన క్రైమ్ థ్రిల్లర్ సినిమా. ఇందులో మోహన్ లాల్, మీనా నటించారు. ఇందులో జార్జ్ కుట్టి (మోహన్ లాల్) అనే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేసే ప్రయత్నాలు చూడొచ్చు. ఒక పోలీస్ ఆఫీసర్ కొడుకు కనిపించకుండా పోవడం, దానికి జార్జ్ కుట్టి ఫ్యామిలీయే కారణమన్న అనుమానం పోలీసులకు కలుగుతుంది.

అనుకోకుండా ఓ వ్యక్తిని హత్య చేసిన తన భార్య, కూతురిని క...