Hyderabad, మార్చి 12 -- Mohan Babu Murder Case: నటుడు మోహన్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఎప్పుడో 21 ఏళ్ల కిందట హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన నటి సౌందర్యది హత్యే అంటూ ఖమ్మంకు చెందిన ఓ వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనం రేపుతోంది. ఓ భూవివాదం విషయంలోనే ఇలా జరిగిందని ఆ వ్యక్తి చెబుతుండగా.. ఇందులో మోహన్ బాబు తప్పేమీ లేదని దివంగత సౌందర్య భర్త రఘు చెప్పడం గమనార్హం.

ఇప్పటికే తన చిన్న కొడుకు మంచు మనోజ్ ఎపిసోడ్, జర్నలిస్టుపై దాడి కారణంగా తీవ్రమైన విమర్శలు ఎదుర్కొంటున్న మోహన్ బాబు మరోసారి చిక్కుల్లో పడ్డాడు. ఈసారి ఏకంగా సౌందర్యను హత్య చేయించారంటూ ఓ వ్యక్తి ఆరోపిస్తున్నాడు. ఖమ్మంకు చెందిన చిట్టిమల్లి అనే వ్యక్తి మోహన్ బాబుపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నటి సౌందర్యతో అతనికి భూ వివాదం ఉందని అందులో ఆరోపించాడు.

శంషాబాద్ దగ్గరలోని జల్‌పల్లిలో ఆ...