Hyderabad, మార్చి 13 -- Mohan Babu Comments On His Struggles In Career: విలక్షణ నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్నారు కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు. ఎన్నో వందల చిత్రాల్లో నటించి డైలాగ్ కింగ్‌గా కీర్తి సంపాదించారు. అయితే, ఇటీవల కాలంలో వరుసగా మంచు మోహన్ బాబు వివాదాలు ఎదుర్కొంటున్నారు.

మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మనోజ్ ఇద్దరు గొడవ పడటం, ఈ క్రమంలో జర్నలిస్ట్‌పై మోహన్ బాబు దాడి, కోర్ట్ కేసు వంటివి చాలా జరిగాయి. అంతేకాకుండా రీసెంట్‌గా దివంగత స్టార్ హీరోయిన్ సౌందర్య మరణానికి కారణం మోహన్ బాబు ఆరోపిస్తూ ఓ కేసు కూడా ఫైల్ అయింది. కానీ, అందులో ఎలాంటి నిజం లేదని సౌందర్య భర్త జీఎస్ రఘు ఓ లేఖ విడుదల చేసి పూర్తి క్లారిటీ ఇచ్చేశారు.

ఈ నేపథ్యంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో మంచు మోహన్ బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రముఖ జర్నలిస్...