భారతదేశం, ఏప్రిల్ 3 -- టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమి సిస్టర్, ఆమె అత్త చేసిన పని షాక్ కలిగిస్తోంది. షమి సోదరి కుటుంబం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటోంది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ గ్యారెంటీ చట్టం (ఎమ్‌ఎన్‌ఆర్‌ఈజీఏ)లో ఈ ఫ్యామిలీ ఫ్రాడ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయని పీటీఐ వార్తా సంస్థ రిపోర్ట్ లో వెల్లడించింది.

గ్రామాల్లో ప్రజలకు పని కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం గురించి అందరికీ తెలిసిందే. ఈ పథకంలో భాగంగా పనికి వెళ్లే కూలీలకు వేతనాలు చెల్లిస్తారు. కానీ మహ్మద్ షమి సిస్టర్, ఆమె అత్త కుటుంబం మాత్రం పనికి వెళ్లకుండానే అక్రమంగా డబ్బు పొందినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహాలోని గ్రామ సర్పంచ్ అయిన మహ్మద్ షమి సోదరి అత్త గులే ఆయిషా ఈ మోసానికి ప్రధాన సూత్రధారి అని...