భారతదేశం, ఆగస్టు 31 -- ఏడేళ్ల తర్వాత మొదటిసారిగా చైనాలో పర్యటిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.. చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌తో ఆదివారం ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అమెరికా విధించిన భారీ సుంకాల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి, రెండు ఆసియా పొరుగు దేశాలు ఒకదానికొకటి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్న వేళ ఈ భేటీకి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

షాంఘై సహకార సంస్థ (ఎస్​సీఓ) సమ్మిట్ 2025 కోసం చైనాలోని తియాంజిన్ నగరానికి చేరుకున్న ప్రధాని, అక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు అనేక మంది ప్రపంచ నాయకులతో సమావేశమవుతారు. ఈ సమ్మిట్ సందర్భంగానే మోదీ.. జిన్‌పింగ్‌తో భేటీ అయ్యారు. దాదాపు 10 నెలల తర్వాత ఈ ఇద్దరు నేతలు సమావేశం కావడం ఇదే మొదటిసారి. చివరిసారిగా వీరు రష్యాలో జరిగిన బ్రిక్స్ సమ్మిట్‌లో కలుసుకున్నారు.

2020లో గ...