భారతదేశం, మార్చి 12 -- రీఛార్జ్ చేసేటప్పుడు ఎక్కువ డబ్బు కట్ అవుతుంది. ఇది మీరు కూడా పరిశీలించి ఉండవచ్చు. కొన్ని ట్రిక్స్ పాటిస్తే.. అదనపు డబ్బు చెల్లించకుండానే మీ మొబైల్ ని రీఛార్జ్ చేసుకోవచ్చు. గతంలో ఫోన్‌పే, గూగుల్ పే వంటి ఆన్‌లైన్ చెల్లింపు సేవలు మొబైల్ రీఛార్జ్‌లపై క్యాష్‌బ్యాక్‌ను అందించేవి. అయితే ఇప్పుడు రీఛార్జ్‌లు, ఇతర సేవలకు దాని వినియోగదారుల నుండి ఎక్కువ వసూలు చేస్తున్నాయి. మీరు అదనపు డబ్బు చెల్లించకుండా మీ జియో, ఎయిర్‌టెల్ సిమ్‌లను ఎలా రీఛార్జ్ చేసుకోవచ్చో చూద్దాం..

ప్రస్తుతం చాలా మంది మొబైల్ వినియోగదారులు రీఛార్జ్‌ల కోసం ఫోన్‌పే, గూగుల్‌ పే వంటి యూపీఐ యాప్‌లను ఉపయోగిస్తున్నారు. కొన్ని రీఛార్జ్‌లకు సాధారణంగా అదనంగా రూ.2 లేదా రూ. 3 ఖర్చవుతుంది. అదనపు డబ్బు చెల్లించకుండా ఈ విధంగా రీఛార్జ్ చేసుకోవచ్చని చాలా మందికి తెలియదు. మీరు ...