భారతదేశం, ఫిబ్రవరి 7 -- Mlc Nominaions: ఉత్తర తెలంగాణలో కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గురువారం 15 మంది నామినేషన్ లు దాఖలు చేశారు. కరీంనగర్ కలెక్టరేట్ లో నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.

పట్టభద్రుల స్థానానికి 12 మంది, టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి ముగ్గురు నామినేషన్ లు దాఖలు చేశారు. టీచర్ల ఎమ్మెల్సీ స్థానానికి బిజెపి అభ్యర్థి మల్క కొమరయ్య నామినేషన్ దాఖలు చేశారు. బిజెపి జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి తపస్ ఉపాధ్యాయ సంఘం ప్రతినిధులతో కలిసి కొమరయ్య నామినేషన్ దాఖలు చేశారు.

అభ్యర్థుల నుంచి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పతి నామినేషన్లు స్వీకరించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి మెదక్ జిల్లా టేకుమల్ మండలం ఎల్లుపేట గ్రామానికి చె...