భారతదేశం, ఫిబ్రవరి 3 -- Mlc Mallanna On Caste Census : తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కులగణనపై ఆ పార్టీ నేతల నుంచే విమర్శలు తలెత్తున్నాయి. గత కొన్ని రోజులుగా సొంత పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తు్న్న కాంగ్రెస్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న...తాజాగా కులగణనపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రెడ్డి సామాజిక వర్గం లక్ష్యంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు.

కుల గణనపై ఎమ్మెల్సీ మల్లన్న చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. కుల గణన పూర్తిగా బోగస్ అని విమర్శించారు. ఇది జానారెడ్డి సర్వే అంటూ హాట్ కామెంట్స్ చేశారు. బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ చేసిన సర్వేనే 100 శాతం కరెక్ట్ అన్నారు. బీసీ కులగణన రిపోర్టును ఉ* పోసి తగలబెట్టాలని దారుణ వ్యా్ఖ్యలు చేశారు.

ఎమ్మెల్సీ మల్లన్న వ్యాఖ్యలపై కాంగ్రెస్ లో కలకలం రేపుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గం లక్ష్...