భారతదేశం, ఫిబ్రవరి 18 -- Mlc Kavitha : సాగుకు నీళ్లివ్వక రాష్ట్రంలో పంటలు ఎండిపోతున్నాయి, కాంగ్రెస్ పార్టీకి రైతుల ఉసురు తగులుతుందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. సూర్యాపేట జిల్లా పర్యటనలో ఎమ్మెల్సీ కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టును వాడుకోకుండా తెలంగాణను ఎండబెడుతున్నారన్నారు. తక్షణమే మేడిగడ్డ ప్రాజెక్టును వినియోగంలో తేవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి జల విధానం లేదన్నారు. తెలంగాణ నీళ్లు మలపాలన్న సోయి లేని సీఎం రేవంత్ రెడ్డికి లేదని విమర్శించారు.

"ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 199 టీఎంసీలతో బనకచర్లలో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. కానీ మన సీఎం మాత్రం నాగార్జున సాగర్ ను కూడా మన ఆధీనంలోకి తీసుకురాలేకపోయారు. కాళేశ్వరం ద్వారా సూర్యాపేట జిల్లాలో గోదావరి జలాలను పారించింది కేసీఆర్. కృష్ణా పరివాహక ప్రాంతం...