భారతదేశం, మార్చి 4 -- Mlc Election Results : రాష్ట్రంలోని రెండు ప‌ట్టభ‌ద్రులు, ఒక టీచ‌ర్ నియోజ‌క‌వ‌ర్గాలకు ఎమ్మెల్సీ ఎన్నిక‌లు జ‌రిగాయి. రెండు ప‌ట్టభ‌ద్రుల ఎమ్మెల్సీల‌ను టీడీపీ కూట‌మి కైవ‌సం చేసుకుంది. అయితే టీచ‌ర్ ఎమ్మెల్సీ టీడీపీ, జ‌న‌సేన, బీజేపీ మ‌ద్దతు ఇచ్చిన సిట్టింగ్ ఎమ్మెల్సీ ర‌ఘువ‌ర్మ ఓట‌మి చెందారు. పీఆర్‌టీయూ త‌ర‌పున పోటీ చేసిన గాదె శ్రీ‌నివాసులు నాయుడు విజ‌యం సాధించారు. ఇంత వ‌ర‌కు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు గాదె శ్రీ‌నివాసులు నాయుడిని టీడీపీ త‌మ‌వాడే అంటూ క్లైమ్ చేసుకుంటుంది. దీంతో అస‌లు చ‌ర్చ మొద‌లైంది. దీనికి సంబంధించిన ప‌ది కీల‌క అంశాలివే.

1. ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘం నుంచి పోటీ చేసిన గాదె శ్రీ‌నివాసుల‌ు నాయుడు పోటీ చేశాడు. ఆయ‌న‌కు బీజేపీలో కొంత మంది మాత్రమే మ‌ద్దతు ఇచ్చారు. ఆయ‌న గ‌తంలో రెండుసార్లు పీఆర్‌ట...