భారతదేశం, ఫిబ్రవరి 18 -- Mlc Elections: ఉత్తర తెలంగాణలో పట్టభద్రులు, టీచర్ ఓటర్ల సంఖ్య తేలింది. ఫైనల్ ఓటర్ జాబితాను అధికారులు విడుదల చేశారు. ఈనెల 27న జరగనున్న ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు.

కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పరిధిలోని 15 జిల్లాలో పట్టభద్రుల ఓటర్లు మొత్తం 3,55,159 మంది ఉండగా అందులో 2,26,765 మంది పురుషులు, 128392 మంది మహిళలు, ఇద్దరు థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారని ప్రకటించారు.

ఉపాధ్యాయ ఓటర్లు మొత్తం 27088 మంది ఉండగా 16932 మంది పురుషులు, 10156 మంది మహిళలు ఉన్నారు. ఇదే జాబితాతో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఓటర్ల సంఖ్య క్రమంలో పట్టభద్రులకు సంబంధించి 499 పోలింగ్ కేంద్రాలు, ఉపాధ్యాయ ఓటర్లకు 274 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు....