భారతదేశం, మార్చి 7 -- Mlc Elections: కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల టీచర్ల రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బిజేపి కైవసం చేసుకోవడంతో కమలనాథుల్లో సమరోత్సాహం నెలకొంది. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయిన అధికార పార్టీ కాంగ్రెస్ లో అంతర్మధనం మొదలయ్యింది.

కాంగ్రెస్ నేతల మద్య సమన్వయలోపం, సర్కార్ పై వ్యతిరేకతకు నిదర్శనంగా పట్టభద్రులు తీర్పు ఇచ్చారనే ప్రచారం జరుగుతుంది. పోరాడి ఓడిన కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డి మాత్రం పార్టీలోని లోపాలను నివేదిక రూపంలో అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారు.

ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలను బిజెపి కైవసం చేసుకోవడం అధికార పార్టీ కాంగ్రెస్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. అధికారంలో ఉండి పట్టభద్రుల ఎమ్మెల్సీని దక్కించుకోకపోయినందుకు కాంగ్...