భారతదేశం, మార్చి 3 -- Mlc Election Results : తెలుగు రాష్ట్రాల ఎమ్మెల్సీ ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతున్నాయి. తెలంగాణలోని కరీంనగర్- నిజామాబాద్- ఆదిలాబాద్- మెదక్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాన్ని బీజేపీ కైవసం చేసుకుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో బీజేపీ అభ్యర్థి మల్క కొమురయ్య విజయం సాధించారు. ఎలిమినేషన్ లేకుండానే మొదటి ప్రాధాన్యత కావాల్సిన కోటా కింద 12081 కంటే ఎక్కువ ఓట్లు సాధించారు కొమురయ్య. ఇప్పటి వరకు 24,144 ఓట్లు లెక్కింపు పూర్తి కాగా బీజేపీ అభ్యర్థి కొమురయ్యకు 12,959 ఓట్లు వచ్చాయి. వంగ మహేందర్ రెడ్డికి 7182, అశోక్ కుమార్ కు 2621, సిట్టింగ్ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డికి 428 ఓట్లు వచ్చాయి.

కరీంనగర్-మెదక్- నిజామాబాద్ -ఆదిలాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు పూర్తైంది. మొత్తం 25,041 ఓట్లు పోలవ్వగా..వీటిలో 24144 ఓట్లు చెల్లుబాటు అయ్యాయి. 897 ఓట...