భారతదేశం, మార్చి 3 -- Mlc Election Results : తెలుగు రాష్ట్రాల్లో ఆరు ఎమ్మెల్సీ స్థానాలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఏపీలోని ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీలో, ఉభయగోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ఏలూరు సీఆర్‌ రెడ్డి ఇంజినీరింగ్‌ కాలేజీ, కృష్ణా-గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గ ఓట్ల లెక్కింపు గుంటూరు ఏసీ కాలేజీలో జరుగుతోంది.

ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ స్థానం ఓట్ల లెక్కింపునకు 28 టేబుళ్లు ఏర్పాటు చేశారు. 17 రౌండ్లలో కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొత్తంగా 700 మంది సిబ్బంది మూడు షిఫ్టుల్లో కౌంటింగ్ ప్రక్రియలో పనిచేస్తున్నారు. 243 పోస్టల్‌ బ్యాలెట్లు నమోదు కాగా, వీటిలో 42 ఓట్లు చెల్లుబాటుకాలేదు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి రాజశేఖరం, పీడీఎఫ్‌ అభ్యర్థి డి....