భారతదేశం, ఫిబ్రవరి 10 -- Mlc Election Nominations : తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ ఆదిలాబాద్ నిజామాబాద్ మెదక్ పట్టభద్రుల స్థానానికి భారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి. పట్టభద్రుల స్థానానికి 100 మంది, టీచర్ల స్థానానికి 17 మంది నామినేషన్ వేశారు. 11న నామినేషన్లను పరిశీలిస్తారు.‌ 12, 13 తేదీల్లో నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఇచ్చారు.

కరీంనగర్ నిజామాబాద్ ఆదిలాబాద్ మెదక్ పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ స్థానాలకు చివరి రోజు భారీగా నామినేషన్ లు దాఖలయ్యాయి.‌ పట్టభద్రుల స్థానానికి 51 మంది నామినేషన్ వేశారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి బీజేపీ అభ్యర్థిగా అంజిరెడ్డితో పాటు మొత్తం 100 మంది నామినేషన్ దాఖలు చేశారు. ఇక టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి చివరి రోజు 8 మంది నామినేషన్ వేశారు. ఆరు...