భారతదేశం, మార్చి 2 -- MLC Election Counting : ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపుకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. సోమవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అయ్యే కౌంటింగ్ కోసం ఏర్పాట్లన్ని పూర్తి చేసి, మాక్ కౌంటింగ్ నిర్వహించారు. ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల, టీచర్స్ రెండు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కోసం కరీంనగర్ అంబేడ్కర్ స్టేడియం స్టేడియం వద్ద కట్టుదిట్టమైన భద్రత చర్యలు చేపట్టారు.

కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల, టీచర్స్ నియోజకవర్గ స్థానాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మరికొద్ది గంటల్లో ప్రారంభం కానుంది. అందుకు అధికారులు విస్తృత ఏర్పాట్లు చేసి మాక్ కౌంటింగ్ నిర్వహించారు.‌ రెండు ఎమ్మెల్సీ స్థానాల ఓట్లను కరీంనగర్ లోని అంబేడ్కర్‌ ఇండోర్‌ స్టేడియంలో లెక్కిస్తారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపుకు 21 టేబుళ్లు, టీచర్స్ ఓట్ల లెక్కింప...