భారతదేశం, మార్చి 3 -- Mlc Counting: ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రారంభ మైంది. కరీంనగర్ - నిజామాబాద్ - ఆదిలాబాద్ - మెదక్ పట్టభద్రుల, టీచర్ల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం

కరీంనగర్ ఇండోర్ స్టేడియంలో గ్రాడ్యుయేట్స్‌, టీచర్స్ ఓట్ల లెక్కింపు చేపట్టారు. పట్టభద్రుల ఓట్ల లెక్కింపుకు 21 టేబుళ్ళను ఏర్పాటు చేశారు. టీచర్స్ ఓట్ల లెక్కింపుకు 14 టేబుళ్ళ ఏర్పాటు చేశారు.

కౌంటింగ్‌ కేంద్రంలో ముందుగా బ్యాలెట్ బాక్సుల్లోని ఓట్లను కుప్పగా పోసి కట్టలు కట్టే ప్రక్రియ ప్రారంభించారు. 50 ఓట్లకు ఒక కట్ట కడుతున్నారు. ఓట్లను కట్టలు కట్టేందుకు ఆరు గంటల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త ముందుగా వెలువడే అవకాశం ఉంది. 24,963 ఓట్లను లెక్కించిన తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు.

కట్టలు కట్టే ప్రక్రియ...