భారతదేశం, మార్చి 5 -- Mlc Counting: కరీం నగర్‌లో గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. 10వ రౌండ్ పూర్తయ్యే సరికి బీజేపి అభ్యర్థి 4562 ఓట్ల ఆధిక్యతతో ఉన్నారు. ఇప్పటి వరకు బిజేపి అభ్యర్థి అంజిరెడ్డికి 70740 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి 66178 ఓట్లు వచ్చాయి.‌

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీసీ నినాదంతో బరిలోకి దిగిన బిఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ కు 56946 ఓట్లు లభించి మూడో స్థానానికి పరిమితం అయ్యారు. మొత్తం చెల్లుబాటు అయిన 2 లక్షల 24 వేల ఓట్లలో ఇప్పటి వరకు రెండు లక్షల 10 వేల ఓట్లు లెక్కించారు.

ఐదో రౌండ్ వరకు దూసుకెళ్లిన అంజిరెడ్డి ఆరో రౌండులో రెండవ స్థానానికి పడిపోయారు. ఏడు, 8, 9 రౌండ్లకు వచ్చేసరికి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. పదో రౌండ్లో మళ్ళీ ముందుకు వచ్చారు. ఆరో రౌండ్ లో నరేందర్ రెడ్డ...