భారతదేశం, మార్చి 13 -- Rupee symbol: త్రిభాషా వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో ఎంకే స్టాలిన్ ప్రభుత్వం రాష్ట్ర బడ్జెట్ లోగోలో నుంచి కేంద్ర ప్రభుత్వం నిర్ధారించిన రూపాయి చిహ్నాన్ని తొలగించింది. ఆ స్థానంలో 'రు' అనే తమిళ అక్షరాన్ని ముద్రించాలని నిర్ణయించింది. ఒక రాష్ట్రం జాతీయ కరెన్సీ చిహ్నాన్ని తొలగించడం బహుశా ఇదే మొదటిసారి. జాతీయ విద్యావిధానం (NEP), త్రిభాషా విధానాన్ని ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది.

తమిళనాడు ఆర్థిక మంత్రి తంగమ్ తెన్నరసు శుక్రవారం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు. ఆ బడ్జెట్ లోగోలో తమిళ భాషలో భారతీయ కరెన్సీని సూచించే తమిళ పదం 'రుబాయ్' యొక్క మొదటి అక్షరం 'రు' ముద్రించి ఉంది. ఈ లోగోలో "అందరికీ అంతా" అనే శీర్షిక కూడా ఉంది. ఇ...