Hyderabad, ఫిబ్రవరి 10 -- చాలా మంది పిల్లలు కూరగాయలు తినడానికి ఇష్టపడరు. ముఖ్యంగా గుమ్మడికాయ, క్యాబేజీ, క్యారెట్ వంటి కూరగాయల పేరు చెబుతేనే ముఖం విరుచుకుంటరారు. అలాంటి వారికి లంచ్ బాక్సోల్లోకి అన్నం కూరతో పాటు స్నాక్స్ పెట్టడం చాలా కష్టం. అది తినను, ఇది తినను అంటూ బాక్సులు తినకుండానే తీసుకొస్తారు. ఇలాంటి సందర్భాల్లో మీరు వారికి ఆరోగ్యకరమైన, రుచికరమైన కబాబ్‌లను తయారు చేసి లంచ్‌ బాక్స్‌లో ప్యాక్ చేయవచ్చు. ఈ రుచికరమైన స్నాక్స్ ను పిల్లల బాక్సుల్లో పెట్టి పంపారంటే పిల్లలు వదలకుండా తినేస్తారు. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూరగాయలు తినిపించడం గురించి చింతించాల్సిన అవసరం లేదు. కూరగాయలతో కబాబ్‌లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.

-మొదట గుమ్మడికాయ, కాలిఫ్లవర్, క్యారెట్‌లను శుభ్రం చేసి పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి.

-నానబెట్టిన పెసర పప్పును కూడా శుభ్ర...