భారతదేశం, ఏప్రిల్ 9 -- Missing Mobiles : సీఈఐఆర్(CEIR) పోర్టల్ ప్రారంభమైన నాటి నుంచి సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదు చేయబడిన 9,878 దరఖాస్తులలో 2,150 ఫోన్లను గుర్తించి, ఇప్పటివరకు బాధితులకు అందించారు. ఇందులో గత 15 రోజుల క్రితం ఏర్పాటు చేయబడిన స్పెషల్ టీమ్స్ ద్వారా 332 సెల్ ఫోన్ లను తెలంగాణలోనే కాకుండా, పొరుగు రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాల నుంచి రికవరీ చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అన్నారు. పరితోష్ పంకజ్ వాటిని ఈ రోజు "మొబైల్ రికవరీ మేళ" కార్యక్రమం ద్వారా బాధితులకు అందించారు.

మొబైల్ ఫోన్ లేనిదే ఒక చిన్న లావాదేవీ కూడా చేయలేని ఈ రోజుల్లో, మన విలువైన సమాచారం బ్యాంక్ అకౌంట్స్, పాస్ వర్డ్స్ వంటివి మొబైల్ లో సేవ్ చేసి పెట్టుకుంటారని తెలిసిన సైబర్ నేరగాళ్లు మొబైల్ దొంగిలించి, వీక్ పాస్ వర్డ్స్ లను బ్రేక్ చేసి ఫోన్ పే, గూగుల్ ...