భారతదేశం, మార్చి 21 -- వివిధ దేశాలకు చెందిన అందగత్తెలు పాల్గొనే అద్భుతమైన వేడుక మిస్‌ వరల్డ్‌ 2025. ఈ పోటీలకు తెలంగాణ సిద్ధమవుతోంది. మే 7 నుంచి 31 వరకు జరిగే ఈ వేడుకల కోసం గచ్చిబౌలి స్టేడియం, గచ్చిబౌలి ఐఎస్బీ, టీ-హబ్, శిల్పకళావేదిక.. ఇలా పలు ప్రాంతాలను సిద్ధం చేస్తున్నారు. ప్రపంచంలోనే ప్రతిష్టాత్మక పోటీలు కావడంతో.. హైదరాబాద్ పేరు ప్రఖ్యాతులు మరింత విశ్వవ్యాప్తం అవుతాయని ప్రభుత్వం భావిస్తోంది.

దేశంలో ఇప్పటివరకు రెండుసార్లు మిస్ వరల్డ్ పోటీలు జరిగాయి. 1996లో తొలిసారిగా బెంగళూరులో జరిగాయి. ఆ తర్వాత గతేడాదే 71వ ఎడిషన్‌ పోటీలకు ముంబై వేదికైంది. ఇక 72వ ఎడిషన్‌ మన భాగ్యనగరంలో జరగనుంది. ఇతర దేశాల్లో పోటీలు జరిగినప్పుడు ఏర్పాట్లు భారీగానే ఉన్నా.. ఎక్కువ జనసందోహం ఉండేది కాదు. కానీ గతేడాది ముంబైలో జరిగినప్పుడు అందాలను చూడటానికి జనం తరలివచ్చారు. మిస...