Hyderabad, ఫిబ్రవరి 12 -- అందంపై అందరికీ దృష్టి ఉంటుంది. రోజులో మూడు నాలుగు సార్లు అద్దంలో చూసుకునేవారు ఉన్నారు. కానీ కొంతమంది రోజులో చాలాసార్లు అద్దంలో చూసుకుంటూనే ఉంటారు. ప్రతి గంటకి అద్దంలో చూసుకుని మురిసిపోతూ ఉంటారు. తమ ముఖం ఎలా ఉందో అని చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది సాధారణ అలవాటుగా భావిస్తారు.. కానీ నిజానికి ఇది ఒక అసాధారణ ప్రవర్తనగానే చెప్పుకోవచ్చు.

ఇలా పదేపదే అర్థం చూసుకోవడం అనేది మీ ప్రవర్తనలో వచ్చిన పెద్ద మార్పు. దీన్ని శరీర డిస్ఫోర్మిక్ డిజార్డర్ కు సంబంధించినదిగా చెప్పుకుంటారు. ఇది ఒక రకమైన మానసిక ఆరోగ్య సమస్య. అద్దంలో చూసుకోవడం ద్వారా మీ లోపాలను కనిపెట్టాలని అనుకుంటారు. మీరు ఎలా ఉన్నారో పదేపదే చెక్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఒక రకమైన మానసిక రుగ్మతగా కూడా చెప్పుకోవాలి.

అద్దంలో పదేపదే చూసుకోవడం అనేది ఖచ్చితంగా ఒక రుగ్మతకు సంబంధించినదే...