భారతదేశం, ఫిబ్రవరి 24 -- Mirchi Rates : ఆసియాలోనే రెండో అతి పెద్ద మార్కెట్ గా పేరున్న వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ సోమవారం ఎరుపెక్కింది. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి రైతులు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకురాగా.. యార్డు మొత్తం బస్తాలతో నిండిపోయింది. వరుసగా శని, ఆదివారం రెండు రోజుల పాటు వ్యవసాయ మార్కెట్ కు సెలవులు రావడం, సోమవారం తిరిగి మార్కెట్ ఓపెన్ కావడంతో రైతులు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకొచ్చారు.

వివిధ ప్రాంతాల నుంచి సుమారు 80 వేల బస్తాలతో రైతులు ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు రాగా, యార్డు మొత్తం ఎర్ర బంగారంతో నిండిపోయింది. కాగా ఓ వైపు మార్కెట్ యార్డుకు పెద్ద ఎత్తున మిర్చి బస్తాలు తీసుకు వస్తున్నా.. ఆశించిన స్థాయిలో రేటు గిట్టుబాటు కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కు దేశీ మిర్చి,...