భారతదేశం, మే 7 -- పుదీనా మన వంటలలో ఉపయోగించే రుచికరమైన, ఔషధ ఆకు. అయినప్పటికీ ఇది చర్మ సంరక్షణకు అవసరమైన అనేక పోషకాలను కలిగి ఉంటుంది, అందిస్తుంది. అలాగే ఈ ఆకు సహజ యాంటీబయాటిక్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇది మీ చర్మానికి సాయపడుతుంది. వారం రోజులపాటు పుదీనాతో చేసిన ఫేస్ ప్యాక్ వాడండి.

ఈ లక్షణాలు చర్మాన్ని యాంటీ ఇన్‌ఫ్లమేటరీగా, మొటిమలు లేకుండా, మచ్చలు లేకుండా చేస్తాయి. కూలింగ్ గుణాల వల్ల మీరు దీన్ని ఫేస్ ప్యాక్‌గా కూడా ఉపయోగించవచ్చు. ఈ కథనంలో మీ చర్మ సంరక్షణ కోసం పుదీనా ఆకులను ఎలా ఉపయోగించవచ్చో తెలుసుకుందాం..

అరకప్పు దోసకాయ ముక్కలను పావు కప్పు సన్నగా తరిగిన పుదీనా ఆకులను కలిపి బాగా గ్రైండ్ చేసి, ఆ పేస్ట్‌ను ముఖానికి పట్టించి 15-20 నిమిషాలు అలాగే ఉంచి, తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మెుటిమల...