భారతదేశం, ఫిబ్రవరి 6 -- Minor Girl And Boy: బాలికపై మైనర్‌ బాలుడు అత్యాచారం చేయడంతో గర్భం దాల్చిన ఘటన సత్యసాయి జిల్లాలో వెలుగు చూసింది. బాలికకు తీవ్రమైన క‌డుపునొప్పి రావ‌డంతో బాలిక‌ను కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. వైద్యులు ప‌రీక్షించి ఇవి మామూలుగా వ‌చ్చే నొప్పులు కావ‌ని, పురిటి నొప్పుల‌ని పేర్కొన్నారు. దీంతో కుటుంబ స‌భ్యులు అవాక్కైయ్యారు. ఆమెకు నెల‌లు నిండ‌టంతో ప్ర‌స‌వించింది. బాలిక కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు బాలుడిపై పోక్సో కేసు న‌మోదు చేశారు.

ఈ ఘ‌ట‌న శ్రీ‌సత్య‌సాయి జిల్లా ధ‌ర్మ‌వ‌రం ప‌ట్టణంలో బుధ‌వారం సాయంత్రం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ధ‌ర్మవ‌రం ప‌ట్ట‌ణంలో ఓ ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో ప‌దోత‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థినికి, ధ‌ర్మవ‌రంలోనే ప‌ట్టు చీర‌ల పాలీష్ చేసే బాలుడుకి ప‌రిచ‌యం అయింది.

బాలిక‌ను ప్రే...