భారతదేశం, జనవరి 27 -- Minister Ponguleti: స్మార్ట్ సిటీలో భాగంగా కరీంనగర్ లో రెండు రోజుల క్రితం కేంద్ర రాష్ట్ర మంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, బండి సంజయ్, పొన్నం ప్రభాకర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. 24 గంటలు వాటర్ సప్లై, కుమర్వావాడి స్కూల్లో డిజిటల్ క్లాసుల ప్రారంభం సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని సెక్యూరిటీ సిబ్బంది తోసేశారు. దీంతో మంత్రి పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎస్పీ ఎక్కడా? అని ఆరా తీశారు.

అందుబాటులో సిపి లేకపోయేసరికి మంత్రి ఆగ్రహంతో కలెక్టర్ పమేలా సత్పతి పై అసహనం ప్రదర్శించారు. వాట్ ఈజ్ దిస్ నాన్ సెన్స్ అంటూ తీవ్రంగా మందలించారు. అదే సమయంలో మంత్రి పొన్నం కలగజేసుకుని కనీసం ఏసిపి కూడా లేడంటూ అధికారులకు చురకలంటించారు. మంత్రులు అసహనంతో ఆగ్రహం వ్యక్తం చేయడం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతు...