ఆంధ్రప్రదేశ్,ఢిల్లీ, ఫిబ్రవరి 5 -- వాట్సప్ గవర్నెన్స్ లో ఎక్కడైనా డేటా చోరీ జరిగిందని నిరూపిస్తే రూ.10 కోట్లు కానుక కింద ఇస్తానంటూ వైసీపీ నేతలకు మంత్రి నారా లోకేశ్ ఛాలెంజ్ విసిరారు. బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన. గతంలో కూడా వైసీపీ నేతలు ఇదే మాదిరిగా విమర్శలు చేశారని గుర్తు చేశారు. కానీ వారి ఐదేళ్ల పాలనలో ఎక్కడా కూడా నిరూపించలేకపోయారని చెప్పుకొచ్చారు.

"చంద్రబాబుపై దొంగ కేసు పెట్టి, చేయని తప్పునకు 52 రోజులు జ్యుడీషియల్ రిమాండ్ లో ఉంచారు. అలాంటి వాళ్లు నేను ఐటీ మంత్రిగా ఉన్నప్పుడు తప్పు చేసి ఉంటే ఊరికే వదిలిపెడతారా. మాకు ప్రజల డేటా అక్కర్లేదు. కావాల్సింది ఓటర్ లిస్టు మాత్రమే. అది పబ్లిక్ డాక్యుమెంట్. తనకు అసలు ఫోనే లేదని చెప్పిన జగన్ కు వాట్సాప్ గవర్నెన్స్ గురించి ఏమి తెలుస్తుంది..?" అంటూ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు.

"ఆర్టిఫిషియల్...