భారతదేశం, ఫిబ్రవరి 25 -- Minister Lokesh : గవర్నర్‌ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఏపీ శాసన మండలిలో వాడీవేడి చర్చ జరిగింది. గవర్నర్ ప్రసంగంలో 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించామని ముందే ఎలా చెప్పారని వైసీపీ ఎమ్మెల్సీలు ప్రశ్నించారు. దీంతో మంత్రి లోకేశ్ గవర్నర్‌ ప్రసంగాన్ని ఇంగ్లీషులో చదివి వినిపించారు. ఏపీలో పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, కొత్త ప్రాజెక్టుల వల్ల భారీగా ఉపాధి అవకాశాలు వస్తాయని ఆయన స్పష్టం చేశారు.

అయితే లోకేశ్ ఇంగ్లీషులో ప్రసంగం చదవడంపై వైసీపీ ఎమ్మెల్సీలు అభ్యంతరం తెలిపారు. తెలుగు ప్రసంగాన్ని చదవమని వైసీపీ సభ్యులు డిమాండ్‌ చేశారు. దీంతో కొద్దిసేవు సభలో వాగ్వాదం జరిగింది. అనంతరం మంత్రి లోకేశ్‌ తెలుగులో చదివి సమాధానం ఇచ్చారు.

గవర్నర్ ప్రసంగం తెలుగు, ఇంగ్లీష్‌లో ప్రచురణల మధ్య తేడా ఉందంటూ వైసీపీ సభ్యులు ప్రశ్నించారు. ...