తెలంగాణ,మేడారం, ఫిబ్రవరి 12 -- ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారంలో ఆదివాసీ సంప్రదాయాల నడుమ వన దేవతల జాతర ప్రారంభమైంది. అమ్మవార్లను గద్దెల మీదకు తీసుకురావడం మినహా మిగతా అన్ని కార్యక్రమాలు మహా జాతర మాదిరిగానే జరగనుండగా, ఈ నెల 15వ తేదీ వరకు ఈ మేడారం మినీ జాతర కొనసాగనుంది.

ఈ మేరకు బుధవారం ఉదయం సమ్మక్క, సారలమ్మ పూజారులు ఆదివాసీ గిరిజన సంప్రదాయం ప్రకారం ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను అలంకరించి, పూజలు నిర్వహించారు. అంతకుముందు సమ్మక్క పూజా మందిరాన్ని అలుకు పూత చేసి రంగురంగుల ముగ్గులతో సుందరంగా తీర్చిదిద్దారు.

అమ్మవార్లకు చీరలు, పసుపు, కుంకుమలతో సారె సమర్పించారు. బొడ్రాయితో పాటు గ్రామ దేవతలకు పూజలు చేసి జాతరను ప్రారంభించారు. అనంతరం భక్తులను అనుమతించడంతో గద్దెల వద్ద సందడి మొదలై...