భారతదేశం, ఫిబ్రవరి 11 -- Mini Medaram Jatara 2025 : ములుగు జిల్లాలో జరిగే సమ్మక్క సారలమ్మ మినీ మేడారం జాతరకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయి. బుధవారం నుంచి మినీ మేడారం జాతర ప్రారంభం కానుండగా, ప్రభుత్వపరంగా ఏర్పాట్లన్నీ చేశారు. కాగా ఈ జాతరకు దాదాపు 10 లక్షలకు పైగా భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ మేరకు భక్తుల సౌకర్యార్థం మేడారం వరకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది.

అందుకు వరంగల్ రీజియన్ పరిధిలోని బస్ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడిపించేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా వరంగల్ నగరంలోని హనుమకొండ, వరంగల్ బస్టాండ్ నుంచే ఎక్కువ మంది భక్తులు ఆర్టీసీ సేవలు వినియోగించుకునే అవకాశం ఉండగా, వరంగల్ 1, వరంగల్-2 డిపోలతో పాటు హనుమకొండ డిపోలకు చెందిన బస్సులతో మేడారం స్పెషల్ ట్రిప్స్ నడిపేందుకు ...