Hyderabad, ఏప్రిల్ 4 -- మానసిక అనారోగ్యం శరీరాన్ని ప్రభావితం చేస్తుంది అనే విషయాన్ని మీరు చాలా సార్లు విని ఉంటారు. కానీ దీనికి అర్థం చాలా మందికి తెలియక పోవచ్చు. నిజానికి మనసుకీ శరీరానికి మధ్య ఉండే సంబంధమే ఇందుకు కారణం. అంటే మీ మనసులో అనేక రకాల నెగిటివ్ భావాలు, బాధ, కోపం వంటివి నిత్యం మెదులుతూ ఉంటాయి. ఇవి మీ మానసిక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, క్రమంగా శారీరక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తాయి. ఎందుకంటే మనసులోని రకరకాల నెగిటివ్ భావాలు శరీరంలోని వివిధ భాగాలలో చిక్కుకుని, చాప కింద నీరులా వాటికి హాని తలపెడతాయి.

అనేక రకాల కారణాల వల్ల ప్రతి వ్యక్తి ఏదో రకమైన బాధ, కోపం, ఒత్తిడి భయం వంటి రకరకాల నెగిటివ్ ఆలోచనలకు లోనవుతుంటారు. వీటి ప్రభావం శరీరంలోని అనేక భాగాల మీద పడుతుందని గ్రహించలేరు. మీరు కూడా రోజంతా ఇలా వివిధ రకాలుగా బాధపడుతుంటే ఆ ఒత్తిడి, టెన్షన్...