Hyderabad, ఫిబ్రవరి 17 -- హెల్తీ ఫుడ్ తీసుకుందామనుకునే ఆలోచన వచ్చిన ప్రతి ఒక్కరి మైండ్ లో వచ్చే ఆలోచన బాదంపప్పులు. డ్రై ఫ్రూట్స్ అంటే ముందుగా బాదంపప్పులకే ప్రాధాన్యత ఉంటుంది. పాలు, పాల ఉత్పత్తుల ప్రత్యామ్నాయం కోసం చూసే వాళ్లలో కూడా ఉండే మొదటి ఆప్షన్ బాదంపాలే. ఎముకల్లో బలం సమకూర్చుకునేందుకు ప్రయత్నించే వారు పాలు తాగితే కాల్షియం అందుతుంది. మరి బాదంపాలు తాగితే కూడా అవే బెనిఫిట్స్ కలుగుతాయా.. ? పాలతో కలిగే ఇతర అవసరాలను కూడా బాదంపాలు తీరుస్తాయా? అంటే తెలుసుకోవాల్సిందే మరి!

బాదంపప్పులను గ్రైండ్ చేసి నీటితో కలిపి తయారుచేసే బాదంపాలకు, జంతువుల నుంచి పాలకు దాదాపు సమానమైన పోషక విలువలున్నాయని డైటీషియన్ డాక్టర్ రిధిమా కంసేరా అంటున్నారు.

శరీరంలో కాల్షియం బలమైన ఎముకలకు, దంతాల నిర్మాణానికి కచ్చితంగా అవసరం. ఎముక సాంద్రతను కాపాడటానికి కూడా ఇది చాలా అవసరం...