Hyderabad, ఏప్రిల్ 6 -- వేసవిలో పాలు త్వరగా పాడవుతాయి. ముక్కలుగా విరిగిపోతాయి. దీనివల్ల పాలు ఎక్కువ సార్లు కొనాల్సి వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలున్న ఇంట్లో పాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఇక్కడ మేము పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు చిట్కాలు ఇక్కడ ఉన్నాయి.

వేసవిలో పాలే కాదు ఏ ఆహారాలైనా తక్కువ కాలమే తాజాగా ఉంటాయి. చిన్నపాటి అజాగ్రత్త వల్ల పాలు కూడా అధికంగా విరిగిపోతాయి. మీ ఇంట్లో వేసవి రాగానే పాలు విరిగిపోవడం మొదలైతే ఈ 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోండి. ఆ పాలను ఫ్రిజ్ లో పెట్టకుండానే ఇవి తాజాగా ఉంటాయి. ఫ్రిజ్ లో పెట్టిన పాలు కూడా వారం రోజుల పాటూ నిల్వ ఉంచే చిట్కాలు ఇవన్నీ.

1) వేసవిలో ఏదైనా వండిన వంటకం, పానీయం చెడిపోకుండా ఉండాలంటే పదేపదే వేడి చేయాలి. ప్రతి మూడు నాలుగు గంటలకొకసారి పాలను వేడి చేసి అవి విరిగిపోకుండా చూసుకోవాలి. వేడి పాలను ఎప్పుడూ...