Hyderabad, ఫిబ్రవరి 11 -- చలికాలం, వేసవికాలం అనే తేడా లేదు ఫ్రిజ్ ఉపయోగం ఎల్లప్పుడూ ఉంటుంది. కొన్ని వస్తువులను ఫ్రిజ్ లేకుండా నిల్వ చేయడం చాలా కష్టం. పాలు కూడా అలాంటి వస్తువుల్లో ఒకటి. ఫ్రిజ్ లో ఉంచిన పాలు చాలా రోజులు తాజాగా ఉంటాయి. కానీ ఫ్రిజ్ బయట ఉంచినట్లయితే అవి ఒక రోజు కూడా ఉండవు. దాదాపు ప్రతి ఇంట్లోనూ ఏ పదార్థాలు ఫ్రిజ్ లో ఉంచినా, ఉంచకపోయినా పాలు మాత్రం తప్పనిసరిగా ఉంచుతారు. కానీ అలా చేయడం ఆరోగ్యానికి మంచిదేనా?ఫ్రిజ్ లో పాలు నిల్వ చేసే సరైన పద్ధతి ఏమిటి? మనం ఏ తప్పులు చేస్తున్నాం? ఈ విషయాలు తెలుసుకుందాం.

పాలను ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవడానికి, వాటిని ఫ్రిజ్ లో నిల్వ చేయడం చాలా ముఖ్యం. యుఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నివేదిక ప్రకారం, ఫ్రిజ్ లో మీరు పాలను సుమారు ఒక వారం పాటు నిల్వ చేయవచ్చు. ఫ్రిజ్ లేకుండా పాలు ఎనిమిది గంటల వరకు...