Hyderabad, మార్చి 31 -- జుట్టు పెరుగుదల అనేది అన్ని వయసుల వారికి ముఖ్యం. ఎందుకంటే ఒక మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, అందాన్ని ఇచ్చేది జుట్టే. కానీ ఆధునిక కాలంలో అతిగా జుట్టు రాలిపోతుంది. ఎన్ని రకాల సంరక్షణ ఉత్పత్తులను వాడుతున్నా ఫలితం ఉండడం లేదు. అయితే పాలు తాగడం వల్ల జుట్టు బాగా పెరుగుతుందనే అభిప్రాయం మాత్రం ఎంతోమందిలో ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలుసుకునడానికి ప్రయత్నిద్దాం.

పాలు ఆరోగ్యకరమైనవి. వీటిలో పోషకాలు కూడా అధికంగా ఉంటాయి. మనకు శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు పాలల్లో పుష్కలంగా ఉంటాయి. మన శరీరానికి అత్యవసరమైన కాల్షియం, ప్రోటీన్, విటమిన్ బి12 కూడా పాలలో లభిస్తాయి. మొత్తం మీద ఈ పోషకాలు అన్నీ కూడా పాలు తేవడం ద్వారా మనం పొందవచ్చు. ఇవి మన చర్మానికి గోళ్ళకు, జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి. అయితే రోజుకు ఒక గ్లాసు పాలు తాగడం వల్ల జుట్టు పెరుగుత...