Hyderabad, మార్చి 16 -- వేసవిలో వచ్చే తలనొప్పి, ముఖ్యంగా మైగ్రేన్‌ను అధిగమించడం చాలా కష్టం. ఈ సమస్యతో బాధపడేవారు మీ రోజువారీ కార్యక్రమాలను కూడా పూర్తిగా చేసుకోలేరు. రోజంతా అలసట, నీరసాన్ని కలిగిస్తాయి. వేసవిలో వచ్చే మైగ్రేన్‌ మామూలు రోజుల కంటే ఎక్కువసేపు ఉంటుంది. అంత సులభంగా తగ్గదు. మైగ్రేన్‌ దీర్ఘకాలంపాటు వేధించడానికి కారణాలు ఏంటి, దాని నుండి త్వరగా కోలుకోవడం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం రండి.

వేసవి రోజుల్లో డీహైడ్రేషన్ (నిర్జలీకరణం) సర్వసాధారణం. తగినంత నీరు లేనప్పుడు శరీరం సరిగ్గా పనిచేయడంలో ఇబ్బంది పడుతుంది. ఎండవేడికి సాధారణంగానే తలనొప్పిగా ఉంటుంది. అలాంటిది మైగ్రేన్‌ తలనొప్పితో బాధపడేవారికి సమ్మర్లో నొప్పి మరింతగా వస్తుంది. డీహైడ్రేషన్ మైగ్రేన్‌ను మరింత తీవ్రతరం చేసి కోలుకోవడానికి చాలా ఎక్కువ సమయం పట్టేలా చేస్తుంది.

ఎక్క...