భారతదేశం, జనవరి 25 -- Microsoft market cap: టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ జనవరి 24న అధికారికంగా 3 ట్రిలియన్ డాలర్ల మార్కును తాకింది. గత ఏడాది జూన్ లో ఈ రికార్డును సాధించిన ఐఫోన్ తయారీదారు ఆపిల్ తర్వాత ఈ మైలురాయిని చేరుకున్న రెండో కంపెనీగా టెక్ దిగ్గజం నిలిచింది.

గత ఏడాది 3 ట్రిలియన్ డాలర్ల మార్కెట్ క్యాప్ సాధించిన మొదటి కంపెనీ ఆపిల్ విలువను మైక్రోసాఫ్ట్ అధిగమించింది. కానీ, ఆ తరువాత మళ్లీ యాపిల్ మార్కెట్ క్యాప్ కన్నా తక్కువకు పడిపోయింది. 3 లక్షల కోట్ల డాలర్ల మార్కెట్ క్యాప్ ను సాధించిన అనంతరం మైక్రోసాఫ్ట్ షేర్లు బుధవారం నాస్ డాక్ లో 1.17 శాతం వృద్ధితో 403.78 డాలర్ల వద్ద ట్రేడయ్యాయి. మైక్రోసాఫ్ట్ షేరు 401.48 డాలర్ల వద్ద ప్రారంభమై, అంతకుముందు రోజు ముగింపు ధర 398 డాలర్లను అధిగమించింది.

ఓపెన్ఏఐ తో భాగస్వామ్యం ద్వారా ఆర్టి...