భారతదేశం, ఏప్రిల్ 10 -- Microsoft layoff: ప్రాజెక్టులపై కోడర్లు వర్సెస్ నాన్ కోడర్ల నిష్పత్తిని పెంచాలని టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఇప్పుడు మరో లేఆఫ్ రౌండ్ ను అమలు చేయాలని పరిశీలిస్తోంది. ఈసారి లే ఆఫ్ కత్తి మిడిల్ మేనేజర్లపై పడనుందని తెలుస్తోంది. బిజినెస్ ఇన్సైడర్ నివేదిక ప్రకారం ఈ మే నెలలోనే ఉద్యోగాల కోతలు ఉండవచ్చు. ఎన్ని ఉద్యోగాలు పోతాయో స్పష్టంగా తెలియనప్పటికీ, గణనీయమైన భాగమే కోతకు గురి కావచ్చని నివేదిక తెలిపింది.

ప్రొడక్ట్ మేనేజర్లు లేదా ప్రోగ్రామ్ మేనేజర్లు, ఇంజినీర్ల నిష్పత్తి అయిన 'పీఎం రేషియో'ను తగ్గించాలని కంపెనీ భావిస్తోంది. ఉదాహరణకు, ప్రస్తుతం బెల్ భద్రతా సంస్థ ఒక పిఎమ్ కు 5.5 ఇంజనీర్లు ఉన్నారు. అంటే పీఎం నిష్పత్తి 5.5: 1. దీనిని 10: 1 కు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ...