Hyderabad, ఫిబ్రవరి 26 -- రిటైర్మెంట్ అంటే అందరికీ తెలిసిందే. ఉద్యోగంలో పదవీ విరమణ చేసి లేదా రాజీనామా చేసి ఇంటి దగ్గరే ఉండడం. ఇలా పదవీ విరమణ చేయాలంటే అరవై ఏళ్లు రావాలి. అయితే జనరేషన్ జెడ్ యువత మాత్రం కొత్త ట్రెండును తీసుకొచ్చింది. వారు తమ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి మైక్రో రిటైర్మెంట్ ను కనిపెట్టింది.

మైక్రో రిటైర్మెంట్ అంటే వారికి కావాల్సినప్పుడల్లా ఉద్యోగం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటారు. కొన్నాళ్ళు హాయిగా ఎంజాయ్ చేస్తారు. తిరిగి మళ్లీ కొత్త ఉద్యోగంలో చేరిపోతారు. దీనివల్ల వారు సంపాదించడంతోపాటు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అవసరమైనప్పుడు ఉద్యోగంలో చేరి తిరిగి సంపాదన మొదలు పెడుతున్నారు.

ఒకప్పుడు సాంప్రదాయ పదవీ విరమణ మాత్రమే ఉండేది. అంటే 60 ఏళ్లు రాగానే ఉద్యోగం నుంచి పదవి విరమణ చేసి ఇంట్లోనే మనవళ్లతో, మనవరాళ్లతో గడిపేవారు. కానీ క...