భారతదేశం, మార్చి 31 -- టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్ కు షాక్. ఈ లెజెండ్ 100వ సింగిల్ టైటిల్ కు మళ్లీ అడుగు దూరంలో ఆగిపోయాడు. మియామి ఓపెన్ ఫైనల్లో జకోవిచ్ కు భంగపాటు ఎదురైంది. ఈ టైటిల్ పోరులో 19 ఏళ్ల జాకబ్ మెన్సిక్.. జకోవిచ్ ను కంగు తినిపించాడు. ఇండియన్ టైమ్ ప్రకారం సోమవారం (మార్చి 31) జరిగిన ఈ పోరులో వరుస సెట్లలో మ్యాచ్ గెలిచిన మెన్సిక్ టైటిల్ ఎగరేసుకుపోయాడు.

మియామి ఓపెన్ 1000 టోర్నీ ఫైనల్లో జకోవిచ్, మెన్సిక్ మధ్య ఫైనల్ హోరాహోరీగా సాగింది. 37 ఏళ్ల జకోవిచ్.. 19 ఏళ్ల మెన్సిక్ కు గట్టిపోటీనిచ్చాడు. చివరకు మెన్సిక్ 7-6 (7-4), 7-6 (7-4) తేడాతో జకోవిచ్ పై విజయం సాధించాడు. రెండు సెట్లూ ఉత్కంఠభరితంగా ఒకేలా సాగాయి. రెండు సెట్లలోనూ టైబ్రేకర్ లోనే ఫలితం తేలింది. చివరకు టైబ్రేకర్ లో జకోవిచ్ తలవంచాల్సి వచ్చింది.

ఓపెన్ శకంలో ఇద్దరు పురుష ప్లేయర్స్ ...