భారతదేశం, జనవరి 27 -- బ్రిటీష్ ఆటో బ్రాండ్ ఎంజీ తన పాపులర్ ఎలక్ట్రిక్ కారు విండ్సర్ ఈవీ ధరలను 50,000 పెంచింది. అంటే ఇప్పుడు ఎంజీ విండ్సర్ ఈవీ కొనడం కాస్త ఖరీదైనదిగా మారింది. ఈ పెంపు అన్ని వేరియంట్లకు వర్తిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. ఇది తక్షణమే అమల్లోకి వస్తున్నట్టుగా ప్రకటించింది. ఎంజీ విండ్సర్ ఈవీ ప్రారంభ ధర రూ .14 లక్షల నుండి రూ .16 లక్షలు(ఎక్స్-షోరూమ్). ఈ ఈవీకి సంబంధించిన ఫీచర్లు ఏంటో తెలుసుకుందాం..

ఎంజీ విండ్సర్ ఈవీ మూడు వేరియంట్లలో లభిస్తుంది. ఎక్సైట్, ఎక్స్ క్లూజివ్, ఎసెన్స్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఇది కాకుండా ఈ కారు నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఇది క్లే బీజ్, పెర్ల్ వైట్, స్టార్బర్స్ట్ బ్లాక్, టర్కోయిస్ గ్రీన్ రంగుల్లో లభిస్తుంది.

ఎంజీ విండ్సర్ ఈవి 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను ఉపయోగిస్తుంది. ఇది ఒకే ఎలక్ట్రిక్ మోట...