భారతదేశం, మార్చి 2 -- జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా 2025 ఫిబ్రవరిలో 4,000 కార్ల అమ్మకాలు చేసింది. ఈ మొత్తం కార్ల అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 78 శాతానికిపైగా ఉంది. భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్లకు పెరుగుతున్న డిమాండ్‌ను ఈ సేల్ తెలియజేస్తోంది. ఈ కాలంలో కంపెనీ మొత్తం 4,002 మంది కొత్త కస్టమర్లను సంపాదించింది. కంపెనీకి ఈ అమ్మకాలకు రావడానికి ఎంజీ విండ్సర్ ఈవీ చాలా ఉపయోగపడింది.

ఎంజీ విండ్సర్ ఈవీ మోడల్ ఇటీవల 15,000 యూనిట్ల ఉత్పత్తి మైలురాయిని సాధించింది. కొన్ని నెలలుగా దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ కారుగా విండ్సర్ ఈవీ నిలిచింది. విండ్సర్ ఈవీ మైలురాయిపై కంపెనీ ప్రతినిధి మాట్లాడుతూ.. '2024 సంవత్సరం మాకు గొప్పది. మేం మా బ్రాండ్ పేరును పునరుద్ధరించాం. ఇది కాకుండా ఎంజీ విండ్సర్ ఈవీని విడుదల చేసింది. దీనికి వినియోగదారుల నుండి మ...