Hyderabad, ఫిబ్రవరి 23 -- గోధుమపిండి చపాతీలు, రొటీలు రోజూ చేసుకునేలా కాకుండా కొత్తగా తినాలని అనుకుంటున్నారా? అయితే ఈ రెసిపీ మీకు చాలా బాగా నచ్చుతుంది. గుజరాతీయుల ఫేమస్ డిష్ అయిన మేతీ థెప్లాస్ రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. వీటిని ఉదయం బ్రేక్ ఫాస్ట్‌గానూ, రాత్రిపూట అల్పాహారం‌గానూ తినచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ, ఫిట్ నెస్ ప్రియుల నుంచి పేషెంట్ల వరకూ ప్రతి ఒక్కరూ వీటిని నిస్సందేహంగా తినచ్చు.

ఈ మేతీ థెప్లాస్‌లను ఒక్కసారి చేసుకున్నారంటే వారం రోజుల పాటు తినచ్చు. ముఖ్యంగా ప్రయాణాలు చేయాలనుకునే వారు వీటిని చేసుకుని బయల్దేరారంటే వారం రోజుల పాటు ఆహారం విషయంలో బాధపడాల్సిన అవసరం ఉండదు. గుజరాతీ స్టైల్ రొట్టెలు అదేనండీ మేతీ థెప్లాస్ తయారీకి ఏయే పదార్థాలు కావాలో, తయారు చేసే పద్దతి ఏంటో తెలుసుకుందాం రండి.

అంతే ఆరోగ్యకరమైన, రుచిక...