Hyderabad, జనవరి 29 -- ఇప్పుడు దాదాపు ప్రతి ఒక్కరూ జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. కొందరిలో జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు ఉన్నాయి. మరికొందరిలో చుండ్రు ఎక్కువగా పట్టేస్తుంది. దీనికోసం జుట్టును రక్షించే మెంతి సీరమ్ మంచి పరిష్కారంలా పనిచేస్తుంది. దీన్ని మీ జుట్టుకు అప్లై చేయడం వల్ల చాలా సమస్యలు తీరుతాయి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. కాబట్టి మెంతి సీరమ్ ఎలా తయారు చేసుకోవాలో, దాని వల్ల కలిగే ప్రయోజనాలేమిటో చూద్దాం.

జుట్టు రాలడాన్ని నివారించడంలో మెంతికూర చాలా ఎఫెక్టివ్ నేచురల్ రెమెడీగా పనిచేస్తుంది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయి. మెంతికూర జుట్టుకు పోషణను అందించడంలో సహాయపడుతుంది. మూలాల నుండి బలోపేతం చేస్తుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. దీని వల్ల కలిగే ప్రయోజనాలు ఇక్కడ ఉన్నాయి.

జుట్టు రాలే సమస్యను తగ్గించు...